స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న కంగువ త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో ఇవాళ ‘కంగువ’ సినిమా నుంచి సెకండ్ లుక్ రిలీజ్ చేశారు.
ఈ సెకండ్ లుక్ పోస్టర్ లో సూర్య యుద్ధవీరుడిగా కనిపించడంతో పాటు ట్రెండీ లుక్ క్యారెక్టర్ లోనూ సర్ ప్రైజ్ చేస్తున్నారు. విధి కాలం కంటే బలమైనది. గతం వర్తమానం భవిష్యత్ …కాలం ఏదైనా నలుదిక్కులా మార్మోగేపేరు ఒక్కటే..కంగువ అంటూ సెకండ్ లుక్ సందర్భంగా మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. సెకండ్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ‘కంగువ’పై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్, మెస్మరైజ్ చేసే సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ తో ‘కంగువ’ త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.