పవన్ కల్యాణ్ రాజకీయంగా బిజీగా ఉండి ఓజీ సినిమా కంప్లీట్ చేయలేకపోయాడు. దాంతో ఆ సినిమా సెప్టెంబర్ 27 రిలీజ్ డేట్ మార్చుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల స్లాట్స్ దొరకడం అరుదు. అలాంటి అరుదైన అవకాశం వస్తే ఎవరైనా దక్కించుకుంటారు. ఓజీ వాయిదాతో ఎన్టీఆర్ వెంటనే ఆ డేట్ ను తీసుకున్నాడు. దేవరను సెప్టెంబర్ 27న అనౌన్స్ చేశాడు. దాంతో అక్టోబర్ 10న రావాల్సిన దేవర డేట్ ఖాలీ అయ్యింది.
ఆ డేట్ ను సూర్య అందుకున్నాడు. ఆయన కంగువ సినిమాను అక్టోబర్ 10 దసరాకు రిలీజ్ చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించాడు. దసరా అక్టోబర్ 13న వస్తోంది. ఆ వారమంతా సెలవులు ఉంటాయి కాబట్టి సినిమాలకు ఆడియెన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ‘కంగువ’ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు.