సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ #Suriya44 షూటింగ్ పూర్తి
వెర్సటైల్ స్టార్ సూర్య, వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ హైలీ యాంటిసిపేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా #Suriya44 అద్భుతమైన లొకేషన్‌లలో షూటింగ్ పూర్తి చేసుకుంది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సూర్య44 గ్లింప్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. సూర్య ఫ్రెంచ్ గడ్డంతో, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు.ఈ గ్లింప్స్ సినిమా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సూచిస్తోంది.
చదవండి: ‘మా నాన్న సూపర్ హీరో’ ఫాదర్స్, సన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ : సుధీర్ బాబు
ఈ సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నందున, మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ని ప్రారంభించనున్నారు.
ఈ చిత్రానికి శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మహ్మద్ షఫీక్ అలీ ఎడిటర్.
ఈ చిత్రానికి రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్, కార్తికేయ సంతానం (స్టోన్ బెంచ్ ఫిల్మ్స్) సహ నిర్మాతలు.
తారాగణం: సూర్య, పూజా హెగ్డే, జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతలు: జ్యోతిక, సూర్య
బ్యానర్: 2డి ఎంటర్‌టైన్‌మెంట్
సహ నిర్మాతలు: రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్, కార్తికేయ సంతానం (స్టోన్ బెంచ్ ఫిల్మ్స్)
డీవోపీ: శ్రేయాస్ కృష్ణ
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: మహమ్మద్ షఫీక్ అలీ
పీఆర్వో: వంశీ-శేఖర్