కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ చిత్రం కంగువ. ఈ మూవీకి డైరెక్టర్ శివ. రెగ్యులర్ కమర్షియల్ మూవీలా కాకుండా భారీ పీరియాడిక్ మూవీగా రూపొందుతోంది. ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచేశాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఇదే డేట్ కి వస్తున్నాం అంటూ రజినీకాంత్ వెట్టాయన్ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో కంగువ పోటీ నుంచి తప్పుకుంది అని టాక్ బలంగా వినిపిస్తోంది. ఇంతకీ.. నిజంగా కంగువ తప్పుకుందా..? ఇది నిజమే అయితే కంగువ వచ్చేది ఎప్పుడు..?
చదవండి: మహేష్, రాజమౌళి మూవీకి పవర్ ఫుల్ టైటిల్
కంగువ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమాలు బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి చిత్రాలు 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. అయితే.. తమిళ్ నుంచి ఇప్పటి వరకు 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా లేదు. సూర్య కంగువ సినిమాతో 1000 కోట్లు సాధించాలని.. ఈ మూవీ మేకర్స్ గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. 1000 కోట్లు కలెక్ట్ చేయాలంటే బాలీవుడ్ లో కూడా బాగా కలెక్ట్ చేయాలి. అందుకనే ఈ సినిమాని బాలీవుడ్ లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈమధ్య ఈ మూవీ నిర్మాత జ్ఞానవేల్ రాజా.. కంగువ పార్ట్ వ1 చూసిన తర్వాత పార్ట్ 2తో ఎవరూ పోటీకి రాలేరని అన్నారు. ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.
రజినీ వెట్టాయన్ మూవీ రిలీజ్ ఉన్నప్పటికీ కంగువ తగ్గేదేలే అన్నట్టుగా అనౌన్స్ చేసిన అక్టోబర్ 10నే వస్తుందని కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి. అయితే.. సూపర్ స్టార్ రజినీకాంత్ వెట్టాయన్ తో పోటీపడితే కంగువ 1000 కోట్లు కలెక్ట్ చేయడం సాధ్యం కాదనుకున్నారో.. లేక 1000 కోట్లు కలెక్షన్ తర్వాత ముందు ఓపెనింగే కష్టమౌతుంది అనుకున్నారో లేక రజినీతో పోటీ పడడం కరెక్ట్ కాదనుకున్నారో ఏమో కానీ కంగువ మూవీని వాయిదా వేయాలని డిసైడ్ అయ్యారట. మరి.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31న కంగువ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని కోలీవుడ్, టాలీవుడ్ లో కాస్త గట్టిగానే వినిపిస్తోంది. కుంగువ రిలీజ్ డేట్ పై త్వరలో అనౌన్స్ చేస్తారేమో చూడాలి మరి.