తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మించాలనేది సుస్మిత కొణిదెల డ్రీమ్. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలో చిరంజీవి హీరోగా తను ఇప్పటికే ఓ సినిమా ప్లాన్ చేసింది. కల్యాణ్ కృష్ణ ఈ సినిమాకు డైరెక్షన్ చేయాలి. అయితే మెగాస్టార్ కు స్క్రిప్ట్ నచ్చక ఆ సినిమా అటకెక్కింది. ఇప్పుడు ఆ ఛాన్స్ దర్శకుడు హరీశ్ శంకర్ కు దక్కింది.
అయితే సుస్మిత సోలో ప్రొడక్షన్ లో ఆ సినిమా ఉండదని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సుస్మిత ఈ సినిమాను నిర్మించనుంది. మెగాస్టార్ అలా ఈ ప్రాజెక్ట్ సెట్ చేశాడు. మెగా 157గా పిలుస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ కు రెడీ కాబోతోంది. మాస్ కమర్షియల్ అంశాలతో చిరంజీవి 157 మూవీ తెరకెక్కనుంది. హరీశ్ శంకర్ ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ రూపొందిస్తున్నాడు. చిరంజీవి సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభరలో నటిస్తున్నారు.