రెబెల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాను రికార్డుల కోసం తీయలేదంటూ ట్వీట్ చేశారు నిర్మాత స్వప్నదత్. ఈ సినిమాను బాక్సాఫీస్ నెంబర్స్ కోసం కాకుండా ప్యాషన్ తో, సినిమా మీదున్న లవ్ తో నిర్మించామని ఈ పోస్ట్ లో పేర్కొన్నారు. నిర్మాత ఇలా చెబుతుంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి కల్కి సినిమా బాక్సాఫీస్ నెంబర్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. యూఎస్ లో ఎంత కలెక్ట్ చేసింది, వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లు వచ్చాయనేది నెంబర్స్ తో సహా కొత్త పోస్టర్స్ విడుదల చేస్తున్నారు. ఈ రెండు విషయాలు ఒకదానికొకటి కాంట్రాస్ట్ గా ఉన్నాయి.
స్వప్నదత్ ట్వీట్ లో – మీ కల్కి ఫలానా మూవీ రికార్డులు క్రాస్ చేసిందా అని నన్ను కొందరు ఫోన్ చేసి అడుగుతున్నారు. వాళ్ల ప్రశ్నలు ఆశ్చర్యపరుస్తున్నాయి. గతంలో సినిమాల ద్వారా రికార్డులు క్రియేట్ చేసిన వారు ఆ రికార్డుల కోసమే చేయలేదు. మేము ఎప్పుడూ రికార్డుల కోసం సినిమాలు నిర్మించలేదు. అని పేర్కొంది. నిర్మాతకు ఈ వసూళ్ల రికార్డుల మీద ఇంట్రెస్ట్ లేకుంటే. వాళ్లకు తెలియకుండా బాక్సాఫీస్ నెంబర్స్ ఎలా బయటకు వస్తాయనేది ప్రశ్న.