అర్షిద్ వార్సీ పై మండిపడ్డాడు యంగ్ హీరో సుధీర్ బాబు. తాజా గా అర్షిద్ వార్సీ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్యూలో నేను కల్కి సినిమా చూడటం జరిగింది. అమితాబ్ ఫెర్ఫార్మెన్స్ అద్బుతం.. అమితాబ్ ను అటువంటి క్యారెక్టర్ను చూడటం చాలా హ్యాపీగా ఉంది అని ప్రశంసల జల్లు కురిపించాడు . అది అంతవరకూ బాగానే ఉంది..ఆ తరువాత ప్రభాస్ పాత్ర నన్ను చాలా నిరుత్సాహపరిచింది.. అంతేకాకుండా ప్రభాస్ ను చూస్తే ఓ జోకర్ లా అనిపించింది అంటూ కామెంట్ చేసాడు..ఈ కామెంట్స్ విన్న వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అర్షిద్ వార్సీ ని ఓ ఆట ఆడుకుంటున్నారు.
ప్రభాస్ మీద అర్షిద్ వార్సీ చేసిన కామెంట్స్ మీద నవ దళపతి సుధీర్ బాబు స్పందిచడమే కాకుండా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. తెలుగు సినిమా స్ధాయిని ప్రపంచస్ధాయికి తీసుకువెళ్లిన స్టార్ హీరో ప్రభాస్. మీరు నిర్మాణాత్మకంగా ఎంత విమర్శించినా పర్వాలేదు కానీ తప్పుగా మాట్లాడవద్దు. వార్సీ లో వృత్తి నైపుణ్యం తగ్గింది. అందుకే అలా కామెంట్స్ చేస్తునారు..ప్రభాస్ స్ధాయి చాలా పెద్దది ముందు అది తెలుసుకోండి అని ట్వీట్ చేసారు హీరో సుధీర్ బాబు. ప్రభాస్కు వస్తున్న ఆదరణ తట్టుకోలేకే బాలీవుడ్ నుండి ఇటువంటి కామెంట్స్ వస్తున్నాయి అంటున్నారు నెట్ జనులు.