తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఒదెల-2. ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలోని ఓదెల మల్లన్న టెంపుల్ లో క్లైమాక్స్ షూటింగ్‌తో జరుగుతోంది. కీలకమైన టెంపుల్ సెట్ ని హై బడ్జెట్‌తో నిర్మించారు. తమన్నా, ఇతర నటీనటులతో పాటు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
చదవండి: తమిళ్ రాకర్స్ అడ్మిన్ అరెస్ట్
హైదరాబాద్ బోనాలు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చీర కట్టుకుని, తమన్నా భాటియా తలపై బోనం మోస్తూ అద్భుతంగా కనిపించింది. కోఇన్సీడెంట్ గా, బోనాల సంబరాలు జరుగుతున్నప్పుడు బోనాల ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం తమన్నా స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవడం విశేషం.