తమన్నా లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా ఓదెల. మూడేళ్ల కిందట ఓటీటీలో రిలీజై మంచి సక్సెస్ సాధించింది ఓదెల. ఈ సినిమాకు సీక్వెల్ గా ఓదెల 2 తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అశోక్ తేజ. దర్శకుడు సంపత్ నంది ఈ కాన్సెప్ట్ ను క్రియేట్ చేశారు. ఈ సినిమాలో తమన్నా సరికొత్త మేకోవర్ లో శివశక్తిగా కనిపించబోతోంది. శివుడి ఆరాధనకే అంకితమైన పవర్ ఫుల్ వుమెన్ గా తమన్నా నటిస్తోంది.
ఓదెల 2 సినిమా కోసం యాక్షన్ షెడ్యూల్ చేస్తోంది తమన్నా. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ షెడ్యూల్ లో తమన్నా భారీ యాక్షన్ సీక్వెన్సులు, స్టంట్స్ చేస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్సుల్లో పర్ ఫార్మ్ చేసేందుకు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది తమన్నా. డివోషనల్ అంశాలతో యాక్షన్ థ్రిల్లర్ గా ఓదెల 2 సినిమా తెరకెక్కుతోంది.