ఏదైనా గట్టిగా నిర్ణయాలు తీసుకోవాలంటే అది తమిళ చిత్ర పరిశ్రమలోనే సాధ్యం. ఎవరైనా బాయ్ కాట్ చేయాలన్నా చేయగలరు. రీసెంట్ గా సమావేశమైన టీఎఫ్ పీసీ (తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) ఇలాంటి కఠిన నిర్ణయాలు కొన్ని తీసుకుంది. స్టార్ హీరోలు నటించే సినిమాలను థియేటర్స్ లో రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలనేది ఇందులో ముఖ్యమైనది.
ఈ రోజు నిర్మాతల మండలి, సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్ ఓనర్స్ కలిసి సమావేశం నిర్వహించారు. స్టార్ హీరోల సినిమాలను థియేటర్ లో రిలీజైన వెంటనే నెలరోజుల్లో ఓటీటీలోకి తీసుకురావడం వల్ల థియేట్రికల్ గా నష్టపోతున్నామనే అభిప్రాయం ఎగ్జిబిటర్స్ నుంచి వ్యక్తమైంది.
చదవండి: సక్సెస్ సెలబ్రేషన్స్ లో “మ్యూజిక్ షాప్ మూర్తి”
దీంతో థియేటర్, ఓటీటీ రిలీజ్ మధ్య రెండు నెలలు గ్యాప్ ఉండాలని ఈ సమావేశంలో నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. అలాగే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ పెంపులోనూ ఓ నియంత్రణ కోసం అక్టోబర్ 30లోగా ప్రస్తుతం సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసి, నవంబర్ 1 నుంచి కొత్త రెమ్యునరేషన్ రూల్ తీసుకురావాలని అప్పటిదాకా నవంబర్ 1 తర్వాత ఏ సినిమా షూటింగ్ చేయొద్దని నిర్ణయించారు.