థియేటర్ లో కొత్త సినిమా రిలీజ్ కావడమే ఆలస్యం దాన్ని పైరసీ చేసి ఆన్ లైన్ లో పెడుతున్న తమిళ్ రాకర్స్ ముఠా ఆట కట్టించారు కేరళ పోలీసులు. తమిళ్ రాకర్స్ అడ్మిన్ జెఫ్ స్టీఫెన్ రాజ్ ను కేరళలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి ఓ థియేటర్ లో జెఫ్ స్టీఫెన్ రాజ్ తన ఫోన్ తో ధనుష్ రాయన్ సినిమా వీడియో రికార్డ్ చేస్తున్నాడు.
చదవండి: హిలేరియస్ ఫన్ తో వస్తున్న ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’
ఈ పైరసీ జరుగుతుండగా పోలీసులు పట్టుకుని ఐదు రోజుల రిమాండ్ కు తరలించారు. ఇటీవల మలయాళ కొత్త సినిమాల పైరసీపై కంప్లైంట్స్ వచ్చాయి. దీంతో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు మేరకు 12 మంది టీమ్ ఉన్న పోలీసుల బృందం ప్లాన్ చేసి తమిళ్ రాకర్స్ నాయకుడిని అరెస్ట్ చేశారు.