విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి రూపొందిస్తున్న సినిమా క్యాన్సిల్ అయ్యిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని మూవీ టీమ్ వెల్లడించింది. ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్టవుతుందని నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ పేర్కొంది. విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లడంలో ఆలస్యమవుతోంది. దీంతో ఈ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై టీమ్ క్లారిటీ ఇచ్చింది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీస్టార్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే విజయ్, గౌతమ్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. యాక్షన్ థ్రిల్లర్ గా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్ వినిపిస్తోంది.