మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమా మిడ్ నైట్ షోస్ కు తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. రాష్ట్రంలో 23 సెంటర్స్ లో మిడ్ నైట్ షోస్ ప్రదర్శించుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు. వీటితో పాటు ఉదయం 4 గంటలకు 6 షోస్ కు అనుమతి ఇచ్చారు. ఇటీవల ప్రభాస్ సలార్ సినిమాకు కూడా ఇలాగే మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోస్ వేశారు.
వారం రోజుల పాటు ఈ షోస్ కు అనుమతి లభించింది. ఈ షోస్ వరకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అధికారులు వీలు కల్పించారు. సింగిల్ స్క్రీన్స్ లో 250, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో 410 రూపాయలను ఒక్కో టికెట్ రేట్ గా నిర్ణయించారు. పెద్ద సినిమాలకు వారం రోజుల పాటు టికెట్ రేట్స్ పెంచుకునే అవకాశం ఇవ్వాలంటూ ప్రొడ్యూసర్స్ ఎప్పటినుంచో కోరుతున్నారు. స్పెషల్ షోస్ వరకైనా ఈ రేట్ల పెంపు డిస్ట్రిబ్యూటర్స్ కు కలిసిరానుంది.