చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్” ఈ నెల 15న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలో సందడి చేశారు “తంగలాన్” మూవీ టీమ్. హీరో చియాన్ విక్రమ్, హీరోయిన్ మాళవిక మోహనన్, హాలీవుడ్ నటుడు డేనియల్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఫేమస్ బాబాయ్ హోటల్ లో విక్రమ్, మాళవిక టిఫిన్స్ చేశారు. అలాగే వీవీఐటీ కాలేజ్ లో స్టూడెంట్స్ తో కలిసి సందడి చేశారు.
చదవండి: “ధూం ధాం” సినిమా టీజర్ విడుదల
హీరో విక్రమ్ మాట్లాడుతూ – మా “తంగలాన్” మూవీ ప్రమోషన్ కోసం విజయవాడ రావడం హ్యాపీగా ఉంది. బాబాయ్ హోటల్ లో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. వీవీఐటీ కాలేజ్ విజిట్ చేశాం. అక్కడ స్టూడెంట్స్ ఎనర్జీ సర్ ప్రైజ్ చేసింది. తెలుగు ఆడియెన్స్ మంచి సినిమాకు ఎంతగా సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు. నా ‘అపరిచితుడు’ సినిమా దేశంలోనే విజయవాడలో అత్యధిక రోజులు ఆడింది. తంగలాన్ ఒక మంచి సినిమా. మీరంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూసి మీ రెస్పాన్స్ ఇస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ప్రేక్షకులందరికీ నచ్చేలా అన్ని ఎమోషన్స్ తో రంజిత్ గారు ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక కొత్త వరల్డ్ లోకి మిమ్మల్ని “తంగలాన్” సినిమా తీసుకెళ్తుంది. ఆగస్టు 15న తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అన్నారు.