చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు మ్యూజిక్ చేసిన ఎక్సీపిరియన్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో షేర్ చేశారు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్.
చదవండి: దువ్వాడకు టెన్షన్ తగ్గించిన మాధురి భర్త?
మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ – “తంగలాన్” ఒక భారీ సినిమా. ఈ సినిమా కోసం 50 రోజులు రీ రికార్డింగ్ చేశాను. కొన్నిసార్లు రెండు మూడు రోజుల ముందు ట్యూన్ చేయాల్సి వచ్చేది. టైమ్ తక్కువగా ఉండటం ఒక్కటే ఈ సినిమాకు మ్యూజిక్ చేయడంలో నేను ఎదుర్కొన్న సవాలు. అయినా పర్పెక్ట్ ఔట్ పుట్ తీసుకురాగలిగాం. దర్శకుడు పా రంజిత్ తన విజన్ ను నాకు చెప్పాడు. ఆయన విజన్ ను అర్థం చేసుకుని అందుకు తగినట్లు మ్యూజిక్ చేశాను. సంగీత దర్శకుడిగా “తంగలాన్”కు వర్క్ చేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. “తంగలాన్” టైటిల్ సాంగ్, మనకి మనకి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో చాలా వ్యూస్ వస్తున్నాయి. పాటలే కాదు బీజీఎం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ కథలో ప్రేమ, కుట్ర, పోరాటం, కోపం వంటి ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని ఎలివేట్ చేసేలా, మరింతగా ప్రేక్షకులకు ఎఫెక్టివ్ గా రీచ్ చేసేలా బీజీఎం చేశాను. అన్నారు.