తంగలాన్ మూవీ రివ్యూ

Spread the love

సినిమా పేరు – తంగలాన్

నటీనటులు – చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, తదితరులు

సాంకేతిక వర్గం:

సంగీతం – జీవీ ప్రకాష్ కుమార్
ఎడిటింగ్ – ఆర్కే సెల్వ
స్టంట్స్ – స్టన్నర్ సామ్
నిర్మాత – కేఈ జ్ఞానవేల్ రాజా
దర్శకత్వం – పా రంజిత్

కథ:

మన సమాజంలో కులాల పేరుతో మనుషుల మధ్య అడ్డు గోడలు ఉన్నాయి. ఇవి ఒకప్పుడు మరీ ఎక్కువగా ఉండేవి. చిన్న కులాల వారిపై అగ్ర కులాలు పెత్తనం సాగించేవి. వెట్టి చాకిరీ చేయించేవి. భారత స్వాతంత్య్రానికి పూర్వం వెప్పూరు అనే గ్రామంలో ఇలాగే జరుగుతుంటుంది. ఈ గ్రామంలో తన కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు నిమ్న కులానికి చెందిన తంగలాన్ ( చియాన్ విక్రమ్ ). వ్యవసాయం అతనికి ఉపాధి. శిస్తులు, పన్నులు విధిస్తూ తంగలాన్ భూమిని లాక్కుంటాడు ఊరి భూస్వామి. దాంతో తన పొలంలోనే వెట్టి చాకిరికీ చేయాల్సి వస్తుంది. అతనికి భార్య గంగమ్మ (పార్వతీ తిరువోతు) నలుగురు పిల్లలు ఉంటారు. బ్రిటీష్ దొర (డేనియల్) తంగలాన్ కు బంగారం తవ్వే పని అప్పగిస్తాడు. దాంతో కొంత డబ్బు సంపాదించిన తంగలాన్ ఊరికి వెళ్లి భూమి తనఖా విడిపించుకుంటాడు. తన ఊరి వారిని కూడా తనతో పాటు బంగారం తవ్వకానికి రమ్మని పిలుస్తాడు. తంగలాన్ ఈ బంగారం తవ్వకంలో విజయం సాధించాడా లేదా, అతనికి ఆరతి ( మాళవిక మోహనన్) ఎలా అడ్డు పడింది అనేది మిగిలిన కథ.

చదవండి: పుష్కరాలకు ప్రణాళిక..!

విశ్లేషణ:

మ్యాజికల్ రియలిజం అనే కాన్సెప్ట్ తో దర్శకుడు పా రంజిత్ తంగలాన్ సినిమాను రూపొందించాడు. ఈ కథలో లైవ్ క్యారెక్టర్స్ తో పాటు ఫాంటసీ క్యారెక్టర్స్ ఉండటం విశేషం. తంగలాన్ తన పిల్లలకు కథ చెప్పినప్పుడు ఆరతి పాత్రను పరిచయం చేస్తాడు దర్శకుడు పా రంజిత్. తంగలాన్ పూర్వీకులు బంగారం తవ్వకం కోసం ఎలా ప్రయత్నం చేశాడో, ఆ ప్రయత్నాలను ఆరతి ఎలా అడ్డుకుందో, అప్పుడు జరిగిన పోరాటం ఎలాంటిదో తన పిల్లలకు కథగా చెబుతాడు తంగలాన్. ప్రధాన పాత్రల పరిచయంతో మొదలయ్యే తంగలాన్ కథ..ఈ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో ఆసక్తికరంగా మారుతుంది.

తాతకు ఎదురైన అనుభవమే తంగలాన్ లైఫ్ లోనూ రిపీట్ కావడం సర్ ప్రైజ్ చేసే విషయం. స్క్రీన్ ప్లేలో ఈ అంశాలను ఇంటర్ లింక్ చేస్తూ కథను ఆసక్తిగా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు. ద్వితీయార్థంలో తంగలాన్ అతని ఊరి ప్రజలు బ్రిటీష్ దొరలతో కలిసి బంగారం వేట సాగించడం అందుకు ఆరతి అడ్డు పడటం, అనూహ్య ఘటనలు జరిగి భయానికి గురిచేయడం జరుగుతుంటుంది. ఇవన్నీ ట్విస్ట్ లుగా అనిపిస్తూ థ్రిల్ చేస్తాయి. ఆరతి, అరణ్య క్యారెక్టర్స్ ను కథలోకి తీసుకొచ్చిన తీరు ఒక కొత్త అనుభూతిని ప్రేక్షకులకు కలిగిస్తుంది. తంగలాన్ క్యారెక్టర్ లో తంగలాన్ తనకు అలవాటైన పద్ధతిలో ఎంతో సహజంగా నటించాడు. ఇలాంటి పాత్రలు విక్రమ్ కు కొట్టిన పిండి. గంగమ్మగా పార్వతీ తిరువోతు ఆకట్టుకుంది. ఎప్పుడూ గ్లామర్ గా కనిపించే మాళవిక మోహనన్…తంగలాన్ లో ఆరతిగా డిఫరెంట్ రోల్ చేసింది. టెక్నికల్ గా చూస్తే తంగలాన్ లో ది బెస్ట్ ఔట్ కమ్ కనిపిస్తుంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్టులు హైలైట్ గా నిలుస్తాయి. ప్రేక్షకుల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది తంగలాన్.

రేటింగ్: 3/5

Hot this week

దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..

వైసీపీ మాజీ మంత్రికి హైకోర్టులో ఎదురుదెబ్బ..! దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్...

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!

కుప్పంలో వైసీపీకి భారీ షాక్‌..! టీడీపీలోకి మున్సిపల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్‌..!కనీసం ప్రతిపక్ష...

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..!

పవన్ వ్యాఖ్యలతో టీడీపీలో అలజడి..! హోంశాఖ పనితీరు బాలేదన్న డిప్యూటీ సీఎం..!సొంత నియోజకవర్గం...

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!

ఉత్తరాఖండ్‌లో ఘోరం..! బస్సు లోయలో పడి 36మంది శివైక్యం..!కార్తీకమాసం తొలిసోమవారం దేవభూమి ఉత్తరాఖండ్‌లో...

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!

అగ్రరాజ్యంలో మంగళవారమే పోలింగ్..!అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్‌ అయిపోయింది. మరికొన్నిగంటల్లో...

Topics

11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జగన్ హాజరవుతారా?

ఈ నెల 11నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు బడ్టెట్‌ సమావేశాలకైనా జగన్ హాజరవుతారా?ఏపీ...

ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..! సీఎంకు ‘ముడా’ ముప్పు.

కర్ణాటక సీఎంకు ‘ముడా’ ముప్పు..! ఈ నెల 6న పోలీసుల ఎదుట సిద్ధరామయ్య..!మైసూర్‌...

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనిత

పవన్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదన్న హోంమంత్రి అనితఏపీలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత...