చియాన్ విక్రమ్ “తంగలాన్” సినిమా రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడీ మూవీ రిలీజ్ విషయంలో క్లారిటీకి మేకర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. రేపు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. దీంతో సినిమా విడుదల విషయంలోనూ స్పష్టత రానుంది. ట్రైలర్ తో పాటే సినిమా రిలీజ్ డేట్ నూ ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది.
ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చారిత్రక యదార్థ ఘటన నేపథ్యంతో తెరకెక్కిన “తంగలాన్” సినిమా త్వరలోనే వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.