పెళ్లి చూపులు సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్నారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత మూవీస్ డైరెక్షన్ చేస్తూనే నటుడిగానూ కెరీర్ కొనసాగిస్తున్నారు. కీడా కోలా సినిమా ఆయనకు రీసెంట్ గా సక్సెస్ ఇవ్వగా..ఇప్పుడు తరుణ్ భాస్కర్ మరో డిఫరెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను యారో సినిమాస్, డోలాముఖి సబ్‌బల్ట్రాన్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి. తరుణ్ భాస్కర్ లీడ్ రోల్ లో చేస్తున్న ఎంటర్ టైనర్ తో వంశీరెడ్డి దొండపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
చదవండి: రిలీజ్ అవుతున్న విజయ్ ఆంటోనీ “తుఫాన్”
డైరెక్టర్ వేణు ఊడుగులతో కలిసి బూసం జగన్ మోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంటర్ టైన్మెంట్, ఎమోషనల్ డెప్త్ తో కూడిన కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీనివాస్ గౌడ్ అనే పాత్రను అతని భార్య శ్రీలత నుంచి విడాకులు తీసుకున్నట్లు సూచించే స్టాంప్ పేపర్‌తో ఈ సినిమా ప్రకటన చేశారు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ కాస్టింగ్ కాల్‌ని అనౌన్స్ చేసింది