కోలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో భారీ బడ్జెట్ మూవీ ది గోట్. స్టార్ హీరో విజయ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ది గోట్ చిత్రాన్ని ఏజేస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ప్రశాంత్, లైలా తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ది గోట్ రూపొందుతోంది. ఈ రోజు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త సినిమా ది గోట్ నుంచి స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్ లో హాలీవుడ్ సినిమా స్థాయిలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లో ఇద్దరు విజయ్ లు బైక్ పై వెళ్తున్న సీన్ చూపించారు. వీళ్లు బ్రదర్స్ అని అనుకోవచ్చు. ఇద్దరు వేర్వేరు గెటప్స్ లో కనిపించారు. ఈ గ్లింప్స్ లో ఇప్పటిదాకా విననిది వినడానికి, ఇప్పటిదాకా చూడనిది చూడటానికి, ఇప్పటిదాకా తెలియనిది తెలుసుకోవాడనికి ఇదే టైమ్ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న టైమ్ లో ది గోట్ పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది.