ఆదాశర్మ హీరోయిన్ గా నటించిన వివాదాస్పద సినిమా ది కేరళ స్టోరీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాను ఈ నెల 16వ తేదీ నుంచి జీ 5 ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు సుదీప్తో సేన్ రూపొందించారు. కేరళతో పాటు దేశవ్యాప్తంగా ఈ సినిమా రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. అనేకమంది రాజకీయ నాయకులు ఈ సినిమాను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. పలు రాష్ట్రాల్లో ది కేరళ స్టోరీ సినిమాను నిషేధించారు.
ఈ వివాదాస్పద సినిమా ఓటీటీలో చూసేందుకు ఫిల్మ్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. కేరళలో గత కొన్నేళ్లలో 32 వేల మంది మహిళలు తప్పిపోయారు. అలా తప్పిపోయిన వారిలో నలుగురు యువతులు మతం మార్చుకుని ఉగ్రవాద శిక్షణ పొందారనే అంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. ఈ సినిమాలో చూపించిన అంశాలు తప్పని అంటూ కొన్ని పార్టీల రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.