స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నర్ సూర్య నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కంగువ. ఈ సినిమా నుంచి రేపు సూపర్బ్ అప్డేట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. ఈ మేరకు ఇవాళ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. ది మైటీ ఉదిరన్ ఆఫ్ కంగువను రేపు పరిచయం చేస్తామంటూ పేర్కొన్నారు. ఉదిరన్ ఎవరు క్యారెక్టరా, లేక కంగువకు శక్తినిచ్చే ఆభరణమా అనేది రేపు ఉదయం 11 గంటలకు తెలియనుంది.
కంగువ షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా పెంచారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, సీజీ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న కంగువ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. కంగువ మూవీ త్రీడీ వెర్షన్ కూడా రిలీజ్ కానుంది. మొత్తం పది భాషల్లో కంగువను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.