రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో మూవీ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి రెండు పాటలు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్- జిక్కీ సాంగ్ ని రిలీజ్ చేశారు. మిక్కీ జె మేయర్ ఈ పాటను కంపోజ్ చేశారు. వనమాలి లిరిక్స్ అందించారు. కార్తీక్, రమ్య బెహరా పాడారు.
చదవండి: “శివం భజే”పై ప్రశంసలు కురుస్తున్నాయి – హీరో అశ్విన్ బాబు
రవితేజ, భాగ్యశ్రీ పై రొమాంటిక్ మెలొడీగా ఈ పాటను పిక్చరైజ్ చేశారు. ఈ పాటకు బృందా మాస్టర్ కొరియోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15న విడుదల కానుంది.