స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు లీడ్ రోల్స్ లో నటించిన ది ట్రయల్ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు వచ్చేసింది. టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. దర్శకుడు రామ్ గన్ని రూపొందించారు. స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మాతలు కాగా..సుదర్శన్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
గతేడాది నవంబర్ 24న థియేటర్స్ లోకి వచ్చింది ది ట్రయల్ మూవీ. థ్రిల్లర్ మూవీస్ ను ఇష్టపడే ఆడియెన్స్ కు బాగా నచ్చింది. ఓటీటీకి బాగా యాప్ట్ అయ్యే ఈ సినిమాకు అమోజాన్ ప్రైమ్ లో మరింత మంచి ఆదరణ దక్కుతుందని మూవీ టీమ్ ఆశిస్తున్నారు.
ది ట్రయల్ సినిమా స్టోరీ లైన్ చూస్తే.. సబ్ ఇన్ స్పెక్టర్ మిసెస్ రూప, ఆమె భర్త అజయ్ వాళ్ళ మొదటి మేరేజ్ ఆనివర్సరీ ఒక అపార్ట్మెంట్ మెడపైన ఏకాంతంగా జరుపుకుంటున్నప్పుడు అనుకోని సమయంలో అజయ్ కాలు జారి బిల్డింగ్ పై నుంచి పడి చనిపోతాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్.. రూప తన భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందని అనుమానిస్తాడు. ఆమెను ఇంటరాగేట్ చేస్తాడు. రూప మాత్రం తన భర్తది ఆత్మహత్యేనని గట్టిగా చెబుతుంది. ఇంతకీ అజయ్ ది హత్యా?, ఆత్మహత్యా?, హత్యే అయితే పోలీస్ ఆఫీసర్ అయిన రూప తన భర్తనే ఎందుకు చంపింది అనేది సినిమాలో ఆసక్తికరంగా తెరకెక్కించారు.