రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్ట్ 15న రిలీజ్ కు రెడీ అవుతోంది. మేకర్స్ తాజాగా రవితేజ, భాగ్యశ్రీ బోర్సే రొమాంటిక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ ట్రైలర్ లాంచ్‌కు బజ్ ని క్రియేట్ చేస్తోంది.
ఆగస్ట్ 7న మిస్టర్ బచ్చన్ ట్రైలర్ విడుదల కానుంది. నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అజయ్ దేవగణ్ నటించిన బాలీవుడ్ మూవీ ది రైడ్ కు తెలుగు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ సినిమా తెరకెక్కుతోంది.