ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ఓటీటీ డేట్ పై సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. ఈ సినిమాను భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో నెట్ ఫ్లిక్స్ దేవర సినిమాను స్ట్రీమింగ్ చేయబోతోంది. దేవర నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయనుంది.
దేవర సినిమాకు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ఓవర్సీస్ సహా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బాగానే వసూళ్లు రాబట్టిగలిగింది. గ్లోబల్ గ్రాసింగ్ 500 కోట్ల రూపాయల అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. 16 రోజుల్లో ఈ మార్క్ రీచ్ అయ్యింది దేవర. థియేటర్స్ లో చూడలేకపోయిన వారు నెట్ ఫ్లిక్స్ లో దేవర సినిమాను చూడబోతున్నారు. ఫ్యాన్స్ అయితే రిపీటెడ్ గా చూస్తారు. ఏమైనా దేవర త్వరగానే ఓటీటీలోకి వస్తున్నట్లు భావించాలి.
ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని రూపొందించారు. రెండు భాగాల దేవరలో సెకండ్ పార్ట్ త్వరలో షూటింగ్ కు వెళ్లనుంది. దేవర జాన్వీ కపూర్ డెబ్యూ తెలుగు మూవీ అయ్యింది.