మాటల మాంత్రికుడు అనగానే ఠక్కున గుర్తొచ్చేది త్రివిక్రమ్ శ్రీనివాస్. తనదైన స్టైల్ లో డైలాగులు రాసి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. తన డైలాగ్స్ లో పంచ్ ఉంటుంది.. పవర్ ఉంటుంది.. అలాగే హ్యామర్ కూడా ఉంటుంది. అందుకనే సామాన్య జనాలను విశేషంగా ఆకట్టుకునేవి. ఇక గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన స్టైల్ లో సినిమాలు తీస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నారు. అయితే… వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని.. గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా క్లారిటీ ఇచ్చారు. అసలు నిజం ఏంటి..? అసలు ఏం జరిగింది..?
హరీష్ శంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఆగష్టు 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చినా.. హరీష్ శంకర్ మాత్రం ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాడు. అయితే.. ఈ సినిమాలో గురుజీ అంటూ సన్నివేశం పెట్టడం.. అందులో ఓ సెటైర్ వేయడం జరిగింది. ఇండస్ట్రీలో గురుజీ అనేది ఒక్క త్రివిక్రమ్ నే. ఈ సంగతి అందరికీ తెలుసు. అందుచేత హరీష్ శంకర్.. సెటైర్ వేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ నే అంటూ వార్తలు వచ్చాయి. ఇంకొంచం వెనక్కి వెళితే.. పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత స్టార్ట్ అయిన సినిమాలు కంప్లీట్ అయ్యాయి కానీ.. ఉస్తాద్ మాత్రం ఇంకా షూటింగ్ స్టేజ్ లోనే ఉంది.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు.. ఏ సినిమా చేయాలి అనేది డిసైడ్ చేసేది త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే విషయం ఇండస్ట్రీ జనాలు అందరికీ తెలిసిందే. ఆయనే తన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ పక్కనపెట్టించి వేరే సినిమాలు చేయించారని హరీష్ శంకర్ కు త్రివిక్రమ్ పై కోపం అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆ కోపంతోనే మిస్టర్ బచ్చన్ మూవీలో గురుజీ అంటూ సీన్ క్రియేట్ చేసి సెటైర్ వేశారని అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు. అయితే.. హరీష్ శంకర్ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇందులో ఓ అభిమాని త్రివిక్రమ్ తో గొడవ గురించి అడిగితే.. తను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వక ముందే త్రివిక్రమ్ గారు పెద్ద రైటర్. ఆయనంటే చాలా ఇష్టం. చాలా సీనియర్ ఆయన. మరో విషయం ఏంటంటే.. మా నాన్న గారు త్రివిక్రమ్ కు పెద్ద అభిమాని అని.. ఆయనంటే ఎంతో గౌరవమని హరీష్ శంకర్ చెప్పారు.