హీరో విజయ్ దేవరకొండకు ఇటీవల సోషల్ మీడియా నుంచి విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. దీని మీద సైబర్ క్రైమ్ కేసులు కూడా నమోదు అయ్యాయి. విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా విషయంలో అంతకముందు ఖుషి టైమ్ లోనూ ట్రోలర్స్ విశ్వరూపం చూపించారు. సినిమా సక్సెస్ ను ఈ ట్రోల్స్ అడ్డుకోలేకపోయినా యాక్టర్స్ ను చికాకు పెడుతుంటాయి. మన గురించి అంతా బాగా అనుకోవాలనే ఎవరైనా అనుకుంటాం. ఒక స్టార్ గా విజయ్ కు ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.
ఫ్యామిలీ స్టార్ తర్వాత ట్రోలర్స్ కల్కి మీద పడ్డారు. ఈ సినిమాలో విజయ్ చేసిన అర్జునుడి క్యారెక్టర్ పై ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి సమాధానంగా ఆ అర్జునుడి గెటప్ ఫొటోనే తన సోషల్ మీడియా అక్కౌంట్స్ డీపీలుగా పెట్టుకున్నాడు. ఎక్స్, ఇన్ స్టా గ్రామ్ లో విజయ్ అర్జునుడిగా ఉన్న డీపీలు కనిపిస్తున్నాయి. ట్రోలర్స్ కు ఇదే తన సమాధానం అని చెప్పకనే చెప్పాడు విజయ్.