ఒక సినిమా ఒక రిలీజ్ డేట్ ఇస్తారు. పోస్ట్ పోన్ అయితే రెండోసారి..కానీ ఓ సినిమా నాలుగు సార్లు రిలీజ్ డేట్స్ ప్రకటించడం అరుదే. అలాంటి అరుదైన క్రెడిట్ దక్కించుకుంది టిల్లు స్క్వేర్. గత ఏడాది మూడు సార్లు వాయిదా పడిన ఈ సినిమా నాలుగోసారి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించింది. మార్చి 29న టిల్లు స్క్వేర్ ను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇవాళ వెల్లడించారు.
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. రెండేళ్ల కిందట థియేటర్స్ లోకి వచ్చిన డీజే టిల్లు సినిమాకు ఇది సీక్వెల్. డీజే టిల్లు మంచి సక్సెస్ కావడంతో సీక్వెల్ పై అంచనాలు నెలకొన్నాయి. యూత్ ఆడియెన్స్ ఈ సినిమా చూడాలనుకుంటున్నారు.