సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే మూడు సార్లు ఈ సినిమా వాయిదా పడింది. గతేడాది మార్చి, ఆగస్టు, నవంబర్ నెలల్లో మూడు సార్లు మూడు రిలీజ్ డేట్స్ మారాయి. ఇప్పుడు నాలుగోసారి కూడా టిల్లుకు టైమ్ కలిసి రావడం లేదు. ఫిబ్రవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించగా..అదే రోజు రవితేజ ఈగిల్ సినిమా రిలీజ్ కు వస్తోంది.
సంక్రాంతికి రావాల్సిన ఈగిల్ వాయిదా పడి వచ్చే నెల 9కి మారింది. అదే రోజు టిల్లు స్క్వేర్ రావాల్సిఉండగా..ఈ డేట్ ను కూడా మార్చుకోవాలని నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ భావిస్తోందట. ఈ సినిమాను డీజే టిల్లు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ పేరుతో రూపొందిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకుడు కాగా…అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. టిల్వు స్క్వేర్ కొత్త డేట్ త్వరలో అనౌన్స్ చేస్తారట.