హీరో రాజ్ తరుణ్ హీరోగా, డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ..’ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్ అన్నీ వున్న సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ మంచి ఎంటర్‌టైనర్. మా నిర్మాత శివకుమార్ గారు ప్రాణం పెట్టి చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్. మాల్వీ మల్హోత్ర చాలా మంచి యాక్టర్. ఇది ఆమె తొలి తెలుగు సినిమా. ఆమెను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అన్నారు.
చదవండి: మా మహిళ శాసన సభ్యులకు క్షమాపణ చెప్పేవరకు సీఎంను వదలం – కేటీఆర్
డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాను. చాలా రోజుల తర్వాత నాకు దర్శకత్వం అవకాశం ఇచ్చిన నిర్మాత శివకుమార్ గారికి థాంక్స్. ఆయన చాలా మంచి లోకేషన్స్, యాక్టర్స్ ఇచ్చారు. మాల్వి తెలుగమ్మాయిలానే వుంటుంది. చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్’ చెప్పారు.
హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ.. ‘‘మంచి టీమ్‌తో కలిసి వర్క్ చేసినందుకు హ్యాపీగా ఉంది. అందరూ బాగా సపోర్ట్ చేశారు. తెలుగులో పరిచయం చేస్తున్నందుకు ఈ టీమ్‌కు ధన్యవాదాలు. ఇక్కడ మరెన్నో చిత్రాల్లో యాక్ట్ చేయాలని ఉంది. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు.
నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ‘భార్యాభర్తల అనుబంధం గురించి సినిమాలో అద్భుతంగా చూపించాం. తన భార్యను కాపాడుకోవడానికి ఒక వ్యక్తి ఏవిధంగా పోరాటం చేశాడనే అంశాన్ని సినిమాలో చాలా అద్భుతంగా దర్శకుడు తెరకెక్కించారు. సినిమా చాలా బావొచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమాని తీర్చిదిద్దాం. అందరూ థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలి’ అని కోరారు.