రాజ్ తరుణ్ హీరోగా, డైరెక్టర్ ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటించింది. మన్నారా చోప్రా మరో కీలక పాత్రలో కనిపించింది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 2న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి సూపర్బ్ రెస్పాన్స్ తో విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో టీం సక్సెస్ మీట్ నిర్వహించింది.
చదవండి: సర్వే వివరాలు.. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత ఎవరంటే..?
సక్సెస్ మీట్ లో డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా చేశాను. తెలుగు ప్రేక్షకులకు హ్యాట్సాప్. నిన్నటి కంటే ఈ రోజు కలెక్షన్స్ థియేటర్స్ పెరిగాయి. మంచి సినిమాని ఏదీ అడ్డుకోలేదని నిరూపించారు ఆడియన్స్.’ అన్నారు.
నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ‘‘ ‘తిరగబడరసామీ’ సక్సెస్ మీట్ జరుపుకోవడం చాలా ఆనందంగా వుంది. సినిమా 200 థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజు మరో 28 థియేటర్స్ పెరిగాయి. సినిమా పై మంచి రిపోర్ట్, రిజల్ట్ వుంది. సినిమాని సపోర్ట్ చేసున్న తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అన్నారు.