మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 156 సినిమా టైటిల్ ను రేపు అనౌన్స్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఇవాళ మేకర్స్ ప్రకటించారు. రేపు మకర సంక్రాంతి సందర్భంగా సాయంత్రం 5 గంటలకు మెగా 156 మూవీ టైటిల్ వెల్లడిస్తారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథతో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది.
ఈ చిత్రానికి ఇప్పటికే విశ్వంభర అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇదే టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటిస్తారా లేక కొత్త పేరు పెడతారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. చిరంజీవి సరసన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని, మెయిన్ హీరోయిన్ గా త్రిషను సెలెక్ట్ చేశారనే వార్తలు వస్తున్నాయి. మెగా 156కు సంబంధించిన ఒక షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. త్వరలో చిరంజీవి పాల్గొనే కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారు. చిరంజీవి మోకాలి సర్జరీ నుంచి కోలుకోకపోవడం వల్ల ఆయన సెట్ లో అడుగుపెట్టలేదు.