హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “తుఫాన్”. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో “తుఫాన్” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. “తుఫాన్” సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈరోజు మేకర్స్ ఈ సినిమా స్నీక్ పీక్ రిలీజ్ చేశారు.
చదవండి: వెయ్యి మందితో ఫైట్ చేసిన కళ్యాణ్ రామ్
“తుఫాన్” సినిమా స్నీక్ పీక్ యాక్షన్ సీక్వెన్స్ తో ఆకట్టుకుంది. పోలీస్ ఆఫీసర్ తో పాటు పదుల సంఖ్యలో విలన్స్ ఆ హోటల్ కు వస్తారు. వీళ్లంతా తెలుసుకోవాలనుకుంటున్న వ్యక్తి వారి ఎదుటే నిలబడతాడు. పోలీస్ ఆఫీసర్ ముందే ఆ విలన్స్ తో ఫైట్ చేస్తాడు హీరో. స్నీక్ పీక్ లోని ఈ యాక్షన్ సీక్వెన్స్ “తుఫాన్” సినిమాలో హైలైట్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ తో వచ్చిన హైప్ స్నీక్ పీక్ తో మరింత పెరగనుంది.