సంక్రాంతి పోటీలో ఆ నలుగురు

Spread the love

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మూవీ విశ్వంభర. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. భారీ సోషియో ఫాంటసీ మూవీగా రూపొందే ఈ సినిమాను యు.వీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇందులో చిరంజీవికి జంటగా త్రిష నటిస్తోంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి జనవరి 10న రిలీజ్ చేయనున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంక్రాంతికి చిరంజీవితో పాటు వచ్చే మరో సినిమా ఎవరిది అంటే బాలయ్యది అని సమాచారం. బాబీ డైరెక్షన్ లో బాలయ్య భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల రాజస్థాన్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి.. ఇలా వరుసగా సక్సెస్ సాధించి హ్యాట్రిక్ సాధించడంతో ప్రస్తుతం చేస్తోన్న మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తున్నాం అంటున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి టైటిల్ సంక్రాంతికి వస్తున్నాం. ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత వెంకీ, అనిల్ రావిపూడి కలిసి చేస్తోన్న మూవీ ఇది.

చదవండి: “మెకానిక్ రాఖీ” వర్సెస్ “లక్కీ భాస్కర్”

చిరు, బాలయ్య, వెంకీ సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి.. నాగ్ పరిస్థితి ఏంటంటే.. ప్రస్తుతం కుబేర సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దీపావళికి వస్తుందని ప్రచారం జరిగింది కానీ.. ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. మరో వైపు నాగ్.. రజినీ కూలీ మూవీలో నటిస్తున్నారని తెలిసింది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. నా సామి రంగ సక్సెస్ మీట్ లో సంక్రాంతికి కలుద్దాం అన్నారు. దీనిని బట్టి సంక్రాంతికి రావాలని నాగ్ అనుకుంటున్నారు. ఈ నలుగురునే అంటే.. మాస్ మహారాజా రవితేజ కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. 75వ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు. మొత్తానికి సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర పోటీ రసవత్తరంగా మారబోతుంది. మరి.. ఇందులో ఎవరు తప్పుకుంటారో.. కొత్తగా ఎవరు జాయిన్ అవుతారో చూడాలి.

Hot this week

‘గేమ్ ఛేంజర్‌’రివ్యూ

కొన్ని గంటల క్రితం రిలీజైన ‘గేమ్ ఛేంజర్‌’ నన్ను ఆలోచనలో పడేసింది....

డాకు మహారాజ్’ లో కొత్త బాలకృష్ణ ని చూస్తారు : బాబీ

డాకు మహారాజ్' సినిమాలో కొత్త బాలకృష్ణ గారిని చూస్తారు : దర్శకుడు...

‘సంక్రాంతికి వస్తున్నాం’ క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్ -వెంకటేష్

'సంక్రాంతికి వస్తున్నాం' క్లీన్ ఫెస్టివల్ ఫిల్మ్. ఎంటర్ టైన్మెంట్ వెరీ ఫ్రెష్...

నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల వసూల్లు

వసూళ్లలో ఇండియన్‌ నంబర్ వన్ ఫిల్మ్ గా పుష్ప-2 రూ.1831 కోట్ల...

గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది : అంజలి

*‘గేమ్ చేంజర్’ చిత్రంలోని కారెక్టర్‌ నా కెరీర్‌లో బెస్ట్ అవుతుంది :...

Topics

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం: పవన్ కళ్యాణ్

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. కొత్త...

‘మార్కో’ సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ : ఉన్ని ముకుందన్

మార్కో' సినిమాకి మంచి విజయాన్ని అందించిన ఆడియన్స్ కి థాంక్ యూ....

‘తండేల్’ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అల్లు అరవింద్ ప్రెజెంట్స్, నాగ చైతన్య, సాయి పల్లవి, దేవి శ్రీ...