సౌత్ క్వీన్‌గా అందరూ అభిమానంతో పిలుచుకునే స్టార్ హీరోయిన్ త్రిష మొట్ట మొదటిసారి ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టారు. అది కూడా తెలుగు వెబ్ సిరీస్ కావటం విశేషం. సోనీ లివ్‌లో ఆగస్టు 2న బృంద వెబ్‌సీరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో రూపొందిన ఈ సిరీస్ తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లోనూ ఆకట్టుకోనుంది. ఈ సందర్భంగా ఆదివారం ‘బృంద’ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే…
ఇదీ చదవండి: అఫీషియల్ – గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్
‘‘తొమ్మిదేళ్ల నుంచి ఏమైయ్యారు మీరంతా.. నేను లేకుండా ఈ కేసుని మీరు సాల్వ్ చేస్తామనుకుంటున్నారా! చెయ్యండి.. చెయ్యండి చూద్దాం…అని బృంద తన తోటి అధికారితో కోపంగా అంటుంది. దీంతో ప్రారంభమైన బృంద ట్రైలర్‌లో ఆమె పనిచేసే చోట ఎదుర్కొనే అవమానాలను, సూటిపోటి మాటలను సన్నివేశాల రూపంలో చక్కగా చూపించారు. మరో కోణంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చీకటి పడిన తర్వాత జరిగే నర బలలు గురించి కూడా చూపించారు. మరో సన్నివేశంలో యాబై మందికి పైగా చనిపోయారని పోలీస్ అధికారులు మాట్లాడుకుంటూ తమ డిపార్ట్‌మెంట్‌కే అది బ్లాక్ మార్క్ అయ్యిందని అంటుంటారు. ఇదే ట్రైలర్లో ఓ వ్యక్తిని అనుమానాస్పదంగా చూపించారు. బృంద హంతకుడిని వెతుకుటుంది. ఇంతకీ ఎవరా హంతకుడు.. పోలీస్ డిపార్ట్మెంట్‌కే షాకిచ్చిన ఘటన ఏది.. బృంద కేసుని ఎలా స్వాల్వ్ చేసింది’’ అనే తెలుసుకోవాలంటే ‘బృంద’ వెబ్ సిరీస్ చూడాల్సిందేనంటున్నారు రైటర్, డైరెక్టర్ సూర్య మనోజ్ వంగాల