చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా సెట్ లోకి త్రిష అడుగుపెట్టనుంది. ఈ వీక్ లోనే త్రిష ఈ సినిమా షూట్ లో జాయిన్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. త్రిష, చిరంజీవి కలిసి గతంలో స్టాలిన్ అనే సినిమాలో నటించారు. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు వీరు కలిసి సినిమా చేస్తున్నారు. విశ్వంభర కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభమైంది.
అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో షూటింగ్ మొదలుపెట్టారు. ఇందులో చిరంజీవి పాల్గొంటున్నారు. త్రిష కూడా జాయిన్ అయితే వీరి కాంబినేషన్ సీన్స్ చేయనున్నారు. భారీ సోషియో ఫాంటసీ మూవీగా దర్శకుడు వశిష్ట ఈ సినిమాను రూపొందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే సంక్రాంతికి జనవరి 10న విశ్వంభర సినిమాను రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు.