వెంకటేష్, నాని హీరోలుగా దర్శకుడు త్రివిక్రమ్ ఓ మల్టీస్టారర్ కు ప్లాన్ చేస్తున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇండస్ట్రీ సర్కిల్స్ లోనూ ఇది సర్ ప్రైజింగ్ న్యూస్ గా మారింది. అల్లు అర్జున్ తో నెక్ట్ మూవీ ప్లాన్ చేసుకున్న త్రివిక్రమ్ వెంకీ, నాని మల్టీస్టారర్ వైపు ఎందుకు దృష్టి పెట్టారా అనేది ఆసక్తికరంగా మారింది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ నాలుగోసారి కలిసి సినిమా చేస్తున్నారు.
దీనికి సంబంధించి అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే తమిళ దర్శకుడు అట్లీతో తన నెక్ట్ మూవీని అల్లు అర్జున్ అనుకుంటున్నారట. దీంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లేటయ్యేలా ఉందని, ఇంతలో గ్యాప్ ఫిల్లింగ్ కోసం త్రివిక్రమ్ ఈ మల్టీస్టారర్ ఆలోచన చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. వెంకటేష్, నానితో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ త్రివిక్రమ్ రూపొందించాలనుకోవడం మంచిదే. వీళ్లు కలిస్తే ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరపైకి రావడం ఖాయం.