ఎస్ కేఎన్, మారుతి తెలుగులో రిలీజ్ చేస్తున్న”ట్రూ లవర్” సినిమా మీద చాలా తక్కువ టైమ్ లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ వీక్ రిలీజ్ కు వస్తున్న రవితేజ ఈగిల్ కంటే ఈ సినిమా మీదే యూత్ ఆడియెన్స్ లో బజ్ ఉంది. వీలైతే “ట్రూ లవర్” సినిమా చూడాలనే యంగ్ ఆడియెన్స్ కోరుకుంటున్నట్లు ట్రెండ్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాలో మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటించారు. హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ తెలుగుమ్మాయే. ఆమె ఈ సినిమా గురించి చెబుతూ ..కంటెంట్ బాగుందనే సినిమా సక్సెస్ మీద నమ్మకం పెట్టుకున్నామని చెప్పింది. ఇవాళ జరిగిన ఇంటర్వ్యూలో
శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ – కంటెంట్ అనేది ఇప్పుడు కీలకం అయ్యింది. కథ బాగున్న సినిమాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఓటీటీలు వచ్చేశాక వరల్డ్ కంటెంట్ అంతా మనం ఇష్టంగా చూస్తున్నాం. సో అలాంటి మంచి కంటెంట్ “ట్రూ లవర్”లో ఉంది కాబట్టే ఈ సినిమా సక్సెస్ మీద నమ్మకంతో ఉన్నాం. అని చెప్పింది. తెలుగులో మ్యాడ్, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో పాటు మెయిల్ వెబ్ సిరీస్ లో నటించింది శ్రీ గౌరి ప్రియ. “ట్రూ లవర్” సినిమాతో తాను మరో లీగ్ లోకి వెళ్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తోంది.