ఆదిపురుష్ ప్రచార కార్యక్రమంలో ప్రభాస్ తన ఫ్యాన్స్ కు ఓ మాటిచ్చాడు. ఇక నుంచీ ఏడాదికి ఒక సినిమా గ్యారెంటీ, రెండు సినిమాలు కూడా రావొచ్చు అని. ఈ మాట ఇప్పుడు నిజమవుతోంది. ఈ ఏడాది ప్రభాస్ నటించిన రెండు సినిమాలు తెరపైకి రాబోతున్నాయి.
దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. మే 9న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఇక తాజాగా ప్రభాస్ మరో సినిమా రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ప్రభాస్ మూవీ రాజా సాబ్ కూడా ఈ ఏడాది స్క్రీన్స్ మీదకు రానుంది. డిసెంబర్ 20ని ఈ సినిమా రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మే లో కల్కి, డిసెంబర్ లో రాజా సాబ్ రిలీజ్ కు వస్తున్నాయి. ఇలా ఒకే ఏడాదిలో ఏడు నెలల తేడాలో ప్రభాస్ రెండు సినిమాలు రిలీజ్ కు వస్తుండటం ఫ్యాన్స్ ను సంతోషపెట్టే విషయమే.