చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్” ఆగస్టు 15న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు డైలాగ్స్ లోని నాలుగైదు పదాలకు (ఇండియన్ డాగ్, ఫకింగ్) మ్యూట్ ఇచ్చారు. ఈ పదాల ప్లేస్ లో వేరే మాటలు వాడుకోమని చెప్పారు. ఈ సినిమాకు జీరో కట్స్ ఇచ్చారు సెన్సార్ టీమ్.
చదవండి: ప్రభాస్ క్రేజ్ చూపిస్తున్న “రాజా సాబ్” గ్లింప్స్ వ్యూస్
“తంగలాన్” సినిమాను నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” ఒక కొత్త తరహా అటెంప్ట్ కాబోతోందనే అంచనాలు ఉన్నాయి.