‘సరిపోదా శనివారం’ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ గరం గరం నేచురల్ స్టార్ నాని ఫెరోషియస్ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసింది. ఇప్పుడు రెండో పాట ఉల్లాసం రిలీజ్ చేశారు మేకర్స్. నాని, ప్రియాంక మోహన్ మధ్య రొమాంటిక్ నెంబర్ గా ఈ పాట ఉండనుంది. ఈ పాటకు సనరే లిరిక్స్ రాయగా..సంజిత్ హెగ్డే పాడారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. యాక్షన్-అడ్వెంచర్ సరిపోదా శనివారంలో ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. వచ్చే నెలలో సినిమా రాబోతుంది, కాబట్టి మేకర్స్ దూకుడు పెంచారు.