గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమా రిలీజ్ కు ముందు కావాల్సినంత హైప్ తీసుకురావాలనుకున్న మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా ప్రయత్నానికి బ్రేక్ పడింది. భద్రతా కారణాలతో ఇవాళ జరగాల్సిన ఈ సినిమా ప్రి రిలీజ్ కార్యక్రమానికి అనుమతులు దొరకలేదు. దీంతో గుంటూరు కారం ప్రీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటిదాకా లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఒక హైప్ క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ వేడుక ఆగిపోవడం ఒక స్పీడ్ బ్రేకర్ అనుకోవచ్చు.
ప్రీ రిలీజ్ వేదిక మీద గుంటూరు కారం ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆ ట్రైలర్ రిలీజ్ విషయం కూడా సందిగ్ధంలో పడింది. ట్రైలర్ రిలీజ్ పై ఇప్పటిదాకా మూవీ టీమ్ నుంచి క్లారిటీ లేదు. గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కొత్త డేట్ నిర్ణయిస్తే అదే రోజు ట్రైలర్ రిలీజ్ చేస్తారా..లేక ఈలోగా ట్రైలర్ విడుదల చేస్తారా అనేది తెలియాల్సిఉంది. ఈ నెల 12న గుంటూరు కారం గ్రాండ్ గా థియేటర్స్ లోకి రానుంది.