హీరో. : శ్రీ కమల్
హీరోయిన్ : తన్వి ఆకాంక్ష
అలీ, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, శివాజీ రాజా, ఆమని, సుధ,
దర్శకుడు : కె.విజయ భాస్కర్ సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల ఎడిటర్ : MR వర్మ
సంగీతం : ఆర్ఆర్ ధృవన్
నిర్మాత : కె.విజయ భాస్కర్
కథ : తెలుగుదనం ఉట్టిపడేలా ఉషా పరిణయం పేరుతో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలకు మించిందనే చెప్పాలి.
నువ్వు నాకు నచ్చావ్, నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కె.విజయభాస్కర్…
తన తనయుడు శ్రీ కమల్‌ను హీరోగా పెట్టి తానే డైరెక్ట్ చేయడం చిత్రానికి ఓ బిగ్గెస్ట్ అస్సెట్‌గా చెప్పొచ్చు.
విజయ్‌భాస్కర్ క్రాఫ్ట్ బ్యానర్‌పై వచ్చిన ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, నిర్మాతగా అన్నీ తానై కొడుకుపై తన ప్రేమను చాటుకున్నారు. బేసిక్‌గా కె.విజయభాస్కర్ అంటే స్టోరీ లైన్ చిన్నదే అయినా…డైలాగులు, కామెడీ సెగ్మెంట్లతో చిత్రాన్ని చక్కగా నడిపే విధానం ఆయనకే సొంతం.
అయితే ఈ మధ్యకాలంలో చాలామంది కుర్రకారు డైరెక్టర్లు వచ్చి తమసత్తా ఏంటో తెలుగు ఇండస్ట్రీకి చాటుతున్నవేళ… లవ్ ట్రాక్ ఎత్తుకోవడం ఒక పెద్ద సాహసమనే చెప్పాలి.ఇప్పటి తరం యూత్ నాడి పట్టుకోగలడా అన్న సందేహానికి తెరదించి..ఆసాంతం ఎండ్ కార్డు పడేవరకూ కుర్చిలోంచి ప్రేక్షకులు లేవకుండా చేశారంటే…
ఇప్పటి తరం డైరెక్టర్లకు కె.విజయభాస్కర్ ఓ మార్గదర్శి అని కొనియాడకమానదు.
చదవండి: డైరెక్టర్ మృతిపై మంచు మనోజ్ దిగ్భ్రాంతి
ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో హనీ (శ్రీకమల్) సెకండ్ మూవీలా చేయలేదు.
ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉన్న హీరోగా హావభావాలు పలికించాడు.
ఇటు డ్యాన్స్‌లోనూ, అటు ఫైట్స్‌లోనూ తన స్టైల్ చూపించాడు.
హీరోయిన్ ఉషా (తన్వీ ఆకాంక్ష) కూడా తనకిది తొలి చిత్రం.
హీరోకు తగ్గ హీరోయిన్‌గా తన్వీకి మార్కులు పడ్డాయి.
హీరో తండ్రి (శివాజీ రాజా) ఓ బిజినెస్ మ్యాన్. అతనికి ఒక్కగానొక్క కొడుకే మన హనీ.
అల్లరి చిల్లరగా తిరిగే మన హీరోకి ముకుతాడు వేయాలంటే పెళ్లి చేయడం ఒక్కటే బెటరని అనుకుంటాడు.ఈ క్రమంలో ఓ పెళ్లి సంబంధానికి వెళ్లడం, అక్కడ వధువుగా హీరోయిన్ ఉషా ఎంట్రీ ఇవ్వడం చూసిన హీరో …
నాకు ఈ పెళ్లి ఇష్టంలేదని నేరుగా చెప్పడంతో ఆ సంబంధం చెడిపోవడం చకా చకా జరిగిపోతాయి.
ఈ క్రమంలో హీరో ఇంట్లో డిస్కషన్…తండ్రికి పట్టరానంత కోపం…నీ సంపాదన నీవే సంపాదించుకో అని హీరోకి తండ్రి సవాల్ విసరడం…
ఆ సవాల్‌ను తీసుకున్న అతగాడు వెంటనే జాబ్ చూసుకుని జాయిన్ అయిపోవడం…ఆ కంపెనీలో హీరోయిన్ ఉషా తనకు బాస్ అవ్వడం…
ఈ క్రమంలో టామ్ అండ్ జెర్రీలా ఇద్దరిమధ్య కొనసాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
అయితే ఒకరోజు కో ఎంప్లాయిస్‌తో పబ్‌కి వెళ్లి హీరో ఎంజాయ్ చేస్తున్న సమయంలో…
హీరో తల్లి (ఆమని) తరఫు నుంచి ఎన్నో ఫోన్ కాల్స్. అయితే పబ్‌లో ఉన్న మన హీరో ఫోన్ చూసుకోడు.
చివరికి ఆఫీస్‌కి ఫోన్ చేస్తే..అక్కేడ ఉన్న పూజ వెంటనే స్పందించి సకాలంలో ఆస్పత్రికి చేర్పించి ప్రాణాలు కాపాడుతుంది.
ఈ విషయం తెలుసుకున్న హీరో… తన తల్లి ప్రాణాలు కాపాడిన ఉష క్యారెక్టర్‌కి ఫిదా అయిపోయి లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు.
తన తల్లిని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పిన క్షణం నుంచి వారిద్దరూ క్లోజ్ అవడం ఒక ఎత్తయితే…
రోజులు గడుస్తున్నా తమ లవ్‌ని ఒకరినొకరు ప్రపోజ్ చేసుకోరు.
అయితే హీరోని మంచి గ్రాఫిక్స్ డిజైనర్‌గా చూడాలన్నది తండ్రిగా అతని ఆకాంక్ష.
ఉద్యోగం తర్వాత, ముందు దుబాయ్‌లో మూడు నెలలు కోర్సు చేసిరా అని చెప్పడంతో మన హీరో అసలు విషయం పేరెంట్స్‌కి చెబుతాడు.
తాను ఉషని ప్రేమిస్తున్నానని చెప్పడంతో వాళ్లు ఖంగుతింటారు. చేసేది లేక ముందువెళ్లి కోర్సు చేసిరా,
నీ పెళ్లి విషయం మేం చూసుకుంటాం అని చెప్పడంతో… తను ప్రేమిస్తున్నానన్న విషయం హీరోయిన్‌కి చెప్పకుండానే దుబాయ్ వెళ్లిపోతాడు.
కాల క్రమంలో మూడు నెలలు ఇట్టే గడిచిపోతాయి.
ఇండియాకు తిరుగుప్రయాణ సమయంలో ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా…
కొంతమంది దుండగులు బెదిరిస్తున్న ఓ వ్యక్తిని చూసి కాపాడుతాడు హీరో హనీ.
ఇక వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. తన లవ్ స్టోరీ గురించి అతగాడికి హీరో చెప్పడం ఒక ఎత్తయితే…
అతనికి, హీరోయిన్ పూజకి అప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోవడం సినిమాకు టర్నింగ్ పాయింట్.
అయితే హనీ తనను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న పూజ తనలో తాను నలిగిపోతూ ఉంటుంది.
అప్పటికే వేరే వ్యక్తితో నిశ్చితార్థం అయిన తాను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక సతమతమవుతూ ఉంటుంది.
అయితే ఇటు వరుడికి, అటు వధువుకి హనీ తెలియడంతో అతనే పెళ్లిపనులు దగ్గరుండి చూసుకుంటాడు.
ఓ వైపు పెళ్లి ముహూర్త క్షణాలు దగ్గరపడుతుంటే హీరో హీరోయిన్లు ఇక ఎలా కలుస్తారన్న ప్రశ్న ప్రేక్షకుల మదిలో మెదిలే వేళ…
దర్శకుడు కె.విజయభాస్కర్ ఓ చక్కటి ఓ సన్నివేశంతో తెరదించుతాడు.
హీరోయిన్ మెడపై పెద్ద పుట్టుమచ్చ ఉంటుందని సాక్ష్తాత్తూ హీరో హనీనే…తాను కాపాడిన సమయంలో ఆ వ్యక్తి చెప్పడం…
తాళి కట్టే సమయంలో పూజ మెడను చూసిన వరుడు…నీకు హనీ అంటే ఇష్టమా అని తన అభిప్రాయాన్ని తెలుసుకుని…
తాను కుర్చోవల్సిన స్థానంలో పెళ్లికొడుకుగా హనీని కూర్చొబెట్టి స్నేహధర్మం పాటించడంతో కథ సుఖాంతం అవుతుంది.
చిత్ర బలాబలాలు – ఆర్.ఆర్.ధృవన్ ఇచ్చిన మ్యూజిక్ హైలెట్, అన్ని సాంగ్స్ బాగున్నాయి. దానికి తగ్గ లొకేషన్స్ కూడా చాలా రిచ్‌గా ఉన్నాయి. సతీష్ ముత్యాల డీవోపీ బాగుంది.
హీరో డ్యాన్స్, ఫైట్స్‌తోపాటు సీనియర్ యాక్టర్లు సుధ, శివబాలాజీ, ఆమని తమ పాత్రలకు న్యాయం చేశారు. అలీ మరియు వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్స్ థియేటర్‌లో నవ్వులు పూయించాయి. మరోవైపు కె.విజయభాస్కర్ తనయ
కాస్ట్యూమ్స్ డిజైనర్ కావడంతో హీరో హీరోయిన్లు ఎప్పటికప్పుడు కొత్త లుక్‌లో కనపడటం స్క్రీన్ చాలా రిచ్‌నెస్ తీసుకొచ్చింది. విజయభాస్కర్ మూవీ అంటేనే పంచులు, ప్రాసలు ఉంటాయిగా…ఈ విషయంలో ఈ మూవీ కూడా ఏమాత్రం తీసుపోవు
చిత్ర బలహీనతలు – కథ పాతదే అయినా కొత్తదనం లేకపోవడం
హీరోయిన్ అందగత్తే అయినా ఎక్స్‌ప్రెషెన్స్ అండ్ ఎమోషన్స్ వీక్‌గా ఉండటం.
సెకండాఫ్‌లో ఎక్కువ సీన్లు నలుగురైదుగురు మధ్యే కొనసాగడం ఈ చిత్రానికి మైనస్ పాయింట్స్
ఓవరాల్‌గా పెద్ద డైరెక్టర్ చేతినుంచి వచ్చిన ఈ చిన్న సినిమా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఏ మాత్రం తీసిపోలేదు.
(గమనిక – ఈ మూవీ రివ్యూ ప్రేక్షకుల అభిప్రాయాలనుంచి సేకరించింది మాత్రమే)
రేటింగ్ : 3/5