యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఇవాళ తన పుట్టిరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ నుంచి అప్టేడ్ ఇచ్చారు మేకర్స్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఎస్వీసీసీ సంస్థ నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్ గా వైష్ణవి నటిస్తోంది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి బర్త్ డే విశెస్ చెబుతూ వైష్ణవి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ లో వైష్ణవి కొత్తగా కనిపిస్తోంది. వైష్ణవి కెరీర్ లో ఇదొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబోతోంది.
యూట్యూబర్ గా ఎదిగిన తర్వాత బేబీ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది వైష్ణవి. ఈ సినిమాతో ఆమెకు బాక్సాఫీస్ సక్సెస్ మాత్రమే కాదు మంచి నటిగా పేరొచ్చింది. దాంతో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వైష్ణవి ఆనంద్ దేవరకొండ, దిల్ రాజు వారసుడు ఆశిష్ లతో సినిమాలు చేస్తోంది. సిద్ధు ఆమె నటిస్తున్న సినిమా మూడో బిగ్ మూవీ అనుకోవచ్చు.