మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ ను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు హీరో వరుణ్ సందేశ్.
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – “విరాజి” ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మెంటల్ ఆస్పత్రి దగ్గర కొద్దిమంది ఉంటారు. వారి దగ్గరకు ఆండీ వస్తాడు. అతను వచ్చాక గందరగోళం మొదలవుతుంది. అదేంటి అనేది తెరపై చూడాలి. ఈ కథలో అంతర్లీనంగా సోషల్ మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో నా లుక్ చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. కానీ వాటికి ఈ సినిమానే సమాధానం చెబుతుంది. “విరాజి” సినిమా చూశాక నేను ఎందుకు ఈ మేకోవర్ లో ఉన్నాను అని తెలుసుకుంటారు. ఈ సినిమా చూశాక ఆండీ క్యారెక్టర్ పట్ల గర్వపడతారు. “విరాజి” కథలో చాలా టిస్టులు టర్న్స్ ఉంటాయి. ఒక మంచి మూవీ చేశామని మేమంతా కాన్ఫిడెంట్ గా ఉన్నాం.
చదవండి: లెక్కల మాస్టారు చాణక్య వర్మగా ప్రియదర్శి
ఈ సినిమాలో వర్క్ చేస్తున్నప్పుడు మేకోవర్ కోసమే ఎక్కువ కష్టపడ్డాను. హెయిర్ కలరింగ్ కోసం 7 అవర్స్, అలాగే టాటూస్ కోసం దాదాపు గంట సమయం పట్టేది. ప్రతి రోజూ ఒక స్నేక్ టాటూ వేసేవాళ్లం. “విరాజి” సినిమా చూశాక ఎమోషనల్ అయ్యాను. నా గురించి, నా సినిమాల గురించి, నా కెరీర్ గురించి ఎవరైనా ఏదైనా అంటే నేను భరిస్తాను. నటుడిగా నా కెరీర్ లో విమర్శలు కూడా ఒక భాగం. కానీ నా వైఫ్ వితిక ఫైర్ బ్రాండ్. అందుకే తను నా కెరీర్ గురించి స్పందిస్తూ మాట్లాడింది. వితిక లాంటి భార్య ఉండటం నా అదృష్టం. కథ బాగుండి, క్యారెక్టర్ నచ్చితే ఏ సినిమా అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. మంచి స్టోరీ ఉంటే వెబ్ సిరీస్ ల్లోనూ నటించాలని ఉంది. మైఖేల్ సినిమాలో విలన్ గా కనిపించాను. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలనే పరిమితులు ఏవీ లేవు. అన్నారు.