సినిమా చిన్నదే , కంటెంట్ లో కాదు
నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల తదితరులు
దర్శకులు: ఆద్యంత్ హర్ష
నిర్మాత :మహేంద్ర నాథ్ కూండ్ల
సంగీత దర్శకుడు: ఎబినేజర్ పాల్(ఎబ్బి)
సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్
ఎడిటర్ :రామ్ తూము
చిన్న సినిమా…
మీరు విన్నది నిజమే…
చాలా చిన్న నిడివిగల సినిమా మాత్రమే,..
కానీ, కంటెంట్ విషయంలో మాత్రం చిన్న సినిమా కాదు…
కేవలం 100 నిమిషాల్లో చిత్రం మొత్తం పూర్తిచేశారంటే డైరెక్టర్ అద్యంత్ హర్ష గొప్పతనం ఏంటో వేరే చెప్పక్కర్లేదు.
ఈ రోజు విడుదలైన ‘విరాజి’ చిత్రం గుర్చే సర్వత్రా చర్చ. టైటిల్ రోల్‌లో హీరో వరుణ్ సందేశ్ చేసిన పాత్ర చాలా విభిన్నం…
‘నింద’ రిలీజ్ అయిన కొన్నివారాలకే ‘విరాజి’ పాత్రలో ప్రేక్షకులను కలుసుకున్నాడు వరుణ్.
కొడుకుది అనుమానిత మృతి కాదని, హత్యచేశారని, నిందితుడికి శిక్షపడాలని ఓ తల్లి శివాలయం వద్ద ఏడుస్తూ కూర్చోవడం చూసిన హీరో విరాజి (వరుణ్ సందేశ్) ఆ కుటుంబానికి అండగా నిలుస్తాడు. ఆ కేసును చేధించడానికి హీరో ఎలాంటి డ్రామా నడిపాడో అన్నదే సినిమా సారాంశం. ఎండ్ కార్డు పడే వరకు ఆద్యంతం మిస్టరీగా సాగుతోంది ప్రతి ఫ్రేమ్. బాధిత కుటుంబంలోని ప్రతిఒక్కరికి ఒక్కో క్యారెక్టర్ క్రియేట్ చేసి హంతకుడిని ఉచ్చులో పడేయడమే పనిగా పెట్టుకుంటాడు మన హీరో. ఒకరికి స్టాండ్ అప్ కమెడియన్‌గా, మృతుడి తల్లిని గైనకాలజిస్టుగా, మరోకరిని హోటల్ మేనేజర్‌గా, ఇంకొకరిని సినిమా నిర్మాతగా క్యారెక్టర్లు డిజైన్ చేసిన హీరో… హంతకుడికి కూడా సందేశం పంపి ఊరిచివర ఓ బూతు బంగ్లాలో వీరంతా కలిసేలా ప్లాన్ చేస్తాడు. వాస్తవానికి ఎస్‌ఐ అయిన హంతకుడికి… ఆ బంగ్లాలోకి వెళ్లినప్పటినుంచి ఎన్నో అనుమానాలు కలుగుతాయి. ఒకింత దెయ్యాలున్నాయేమో అన్న భయంతో వణికిపోయి అక్కడినుంచి తప్పించుకునేందుకు అదే రాత్రి ప్రయత్నిస్తాడు. అయితే అనూహ్యంగా అతడితో కలిసి వచ్చిన మరో ఇద్దరు చనిపోవడంతో …మళ్లీ ఆ బూతు బంగ్లావైపు భయంతో పరుగులు తీస్తాడు. ఆ బంగ్లాలో బందీలుగా ఉన్నవాళ్లంతా ఒక్కొక్కరిగా చనిపోవడం చూసి హంతకుడికి ముచ్చెమటలు పడతాయి. ఇక్కడ వరకు హీరో ఎంట్రీని రివీల్ చేయని డైరెక్టర్….ఒక్కసారిగా ఓ వింత గెటప్‌లో ఆండీ అనే పేరుతో వరుణ్ సందేశ్‌ను బంగ్లాలో బందీలుగా ఉన్నవాళ్లకు తోడుగా పంపుతాడు. తలకు రెండు రంగులు, ముక్కుపుడక, జీన్స్, హుడీతో…అమెరికన్ యాక్సెంట్, పైగా డ్రగ్ అడిక్ట్‌గా ఆండీ (వరుణ్‌సందేశ్) క్యారెక్టర్‌ను బాగా డిజైన్ చేశాడు డైరెక్టర్. ఇదిలాఉంటే
చదవండి: ప్రేక్షకులు ఆశీర్వదించిన ఉషా పరిణయం
బంగ్లాలో జరిగే హత్యలన్నీ ఆండీనే చేస్తున్నాడన్న అనుమానం ఒకానొక దశలో ప్రేక్షకులకూ కలుగుతుంది. అయితే ఎవరో ఇదంతా చేస్తున్నారని, హంతకుడికి మనమంతా ఏదో ఒక సందర్భంలో ఉమ్మడి శత్రువులం అయి ఉంటామని, అసలు మీరంతా ఎవరికి అన్యాయం చేశారో చెప్పండి…అప్పుడే మనం ఈ బంగ్లా నుంచి తప్పుకునే మార్గం సులువు అవుతుందని ఆండీ చెప్పడంతో…ముందే అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయినవాళ్లు ఎదుటివాళ్లకు ఏం అపకారం చేసారనది వాళ్లంతా చెప్పగా…ఇక హంతకుడి వంతు రానే వస్తుంది. అప్పుడు జరిగిందంతా అతగాడు చెప్పడంతో తన కొడుకు చనిపోలేదు, చంపబడ్డాడు అని తేలడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టిస్తాడు ఆండీ అలియాస్ విరాజి. ఇంతకీ తన వద్దకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తిని ఎస్‌ఐ ఎందుకు చంపాడు, ఎవరికోసం చంపాల్సి వచ్చిందో తెలుసుకోవాలంటే కచ్చితంగా మూవీ చూడాల్సిందే అంటోంది చిత్రయూనిట్.
చిత్ర బలాబలాలు – వరుణ్ సందేశ్ క్యారెక్టర్‌లో ఎన్నో రకాల షేడ్స్ ఉండటం… ఓ కలెక్టర్‌గా, భరతనాట్య కళాకారుడిగా, ఆండీ పాత్రలో చేసిన డ్రగ్ అడిక్టడ్‌గా చిత్రానికి ప్లస్ అయింది. చివరి అరగంట వరుణ్‌ది వన్‌మ్యాన్ షో అని చెప్పొచ్చు. అంతేనా తల్లి పాత్రలో ఇట్టే ఒదిగిపోయే ప్రమోదిని ..తన ఆకట్టుకునే కళ్లతో సెంటిమెంట్‌ని పండించింది. ఇక హంతకుడిగా ఎస్‌ఐ పాత్రలో నటించిన ‘బలగం’ జయరామ్ క్యారెక్టర్ అయితే చెప్పనవసరం లేదు. తన పాత్రకి ప్రాణం పెట్టాడు. మ్యూజిక్ డైరెక్టర్ బెనజిర్ పాల్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్ద అస్సెట్.
సిట్యువేషన్‌కు తగ్గట్టుగా ఆర్‌ఆర్ ఇవ్వడంతో కథకు మరింత తోడయింది.
చిత్ర బలహీనతలు – ఇసుక అక్రమదందాతో రెండు ఊళ్లు మునిగిపోయాయన్న కంప్లైంట్‌తో నడిచిన ఈ కథలో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చంపబడ్డాడు. హంతకుడు పట్టుబడ్డాడు కానీ, ఆ ఎస్.ఐ వెనుక ఉన్న ఇసుకాసురుడి ఊసే లేకపోవడం ఎక్కడో గాడి తప్పినట్లయింది. మొత్తానికి ‘నేరం’తో మొదలై ‘భయం’తో కొనసాగి ‘న్యాయం’తో ముగింపు పలికిన విరాజికి ప్రేక్షకుల నుంచే కాదు, గంటా 40 నిమిషాల్లో చిత్రం పూర్తిచేయడమే పెద్ద సాహసం అంటూ విమర్శకులు సైతం కొనియాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
(గమనిక – మా ఈ రివ్యూ ప్రేక్షకుల అభిప్రాయలనుంచి మాత్రమే తీసుకున్నది)
రేటింగ్ 3/5