వరుణ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘మట్కా’. ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది.
చదవండి: థియేటర్ లో పెళ్లిళ్లు – మంచి పద్ధతి కాదన్న కృష్ణవంశీ
ఈ రోజు ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్ యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్ లుక్స్ లో కనిపిస్తున్నారు. మట్కా కింగ్ గా ఎదిగిన ఓ సామాన్య యువకుడి కథ ఇది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.