తన కొత్త సినిమా ఆపరేషన్ వాలెంటైన్ ప్రచారం కోసం వాఘా సరిహద్దుకు చేరుకున్నారు హీరో వరుణ్ తేజ్. ఇండియా పాక్ బార్డర్ గా ఉన్న వాఘా సరిహద్దుల్లో ఆపరేషన్ వాలెంటైన్ లోని వందేమాతరం అనే పాటను రిలీజ్ చేయబోతున్నారు. బెంగళూరులో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్న వరుణ్ తేజ్…ఈ పాట రిలీజ్ కోసం వాఘాకు వచ్చారు. ఈ సాయంత్రం వందేమాతరం పాట రిలీజ్ చేయబోతున్నారు.
ఫిబ్రవరి 16న ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించింది. భారత వాయుసేన సాహసాలను చూపించే కథా కథనాలతో దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా రూపొందించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జరిగిన కొన్న వాస్తవ ఘటనల నేపథ్యంతో ఈ సినిమా ఉండనుంది.