తన కొత్త సినిమా షెడ్యూల్ కోసం శ్రీలంక వెళ్తున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన హీరోగా నటిస్తున్న వీడీ 12 నెక్స్డ్ షెడ్యూల్ శ్రీలంకలో జరగనుంది. ఇందుకోసం టీమ్ అంతా అక్కడికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా ఈ సినిమా లెంగ్తీ షెడ్యూల్ వైజాగ్ లో కంప్లీట్ అయ్యింది. ఇదే షెడ్యూల్ లో విజయ్ తన పుట్టినరోజు జరుపుకున్నారు.
స్పై థ్రిల్లర్ కథతో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి వీడీ 12 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ దర్శకుడి గత సినిమా జెర్సీ జాతీయ స్థాయిలో అవార్డ్ లు దక్కించుకుంది. దాంతో వీడీ 12పై అంచనాలు బాగానే ఉన్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వీడీ 12 చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో నాయికను ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పటికే పెట్టుకున్న శ్రీలీల ప్లేస్ లో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు.