విజయ్ దేవరకొండ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రానున్న సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. వీడీ 12గా పిలుస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలో నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు ఆలస్యమైంది. విజయ్ కు అప్పటికున్న ప్రాజెక్ట్స్ డేట్స్ ప్రకారం కాస్త ఆలస్యమైనా ఈ మూవీని పర్ఫెక్ట్ గా చేయాలని ప్లాన్ చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమా ఇది.
వీడీ 12 షూటింగ్ మార్చిలో మొదలుకానుంది. ఈ మేరకు షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఇది కంప్లీట్ కాగానే వీడీ 12 కోసం మేకోవర్ అవుతారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి జెర్సీతో టాలీవుడ్ కు నేషనల్ అవార్డ్స్ అందించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.